calender_icon.png 12 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

01-08-2024 11:28:52 AM

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2014లో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయవద్దనన్న నాటి తీర్పు కొట్టివేస్తూ సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. 6:1 మెజారిటీతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తీర్పు ఇచ్చింది ధర్మాసనం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశం తెరమీదికి వచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయవద్దని నాటి తీర్పు కొట్టివేసింది. పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.