calender_icon.png 31 January, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

31-01-2025 02:45:25 PM

న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే(BRS MLAs)లపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 నెలలు అవుతున్నా స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదు.. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్న బీఆర్ఎస్‌ లాయర్‌ వాధించారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రీజనబుల్‌ టైమ్‌ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా? అని ప్రశ్నించింది. సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి(Senior Advocate Mukul Rohatgi) స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెప్తామన్నారు. దీంతో సుప్రీం కోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy) దాఖలు చేసిన ఈ కేసులో గవాయ్, జస్టిస్ జార్జ్ మసీహ్ వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ, అనర్హత అంశంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని, గత ఏడాది మార్చిలో నిర్దేశించిన గడువు నెరవేరలేదన్నారు. నిర్ణీత గడువులోగా స్పీకర్‌ చర్య తీసుకోకపోవడాన్ని పిటిషనర్‌ తరపు న్యాయవాది నొక్కి చెప్పారు.