11-04-2025 01:39:27 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (విజయక్రాంతి)/ శేరిలింగంపల్లి: నగరం లోని కంచ గచ్చిబౌలిలోని సర్వేనంబర్ 25 లోన భూములను సుప్రీంకోర్టు నియమించిన కేం ద్ర అటవీ, పర్యావరణ సాధికారిక కమిటీ బృం దం గురువారం సందర్శించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఈ కమిటీలోని సభ్యులు సిద్ధాంత్‌దాస్, సీపీ గోయల్, సునిల్ లిమాయే, జేఆర్ భట్ తదితరులు గురువారం ఉదయం హెచ్‌సీయూ లోని 400 ఎకరాల భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ భూముల్లో వృక్షసంపద ఎంత అనే అంశాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం దాదాపు 3గంటల పాటు సీఎస్ శాంతికుమారి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీజీ పీ జితేందర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, రెవెన్యూ, అటవీ శాఖ, ఇతర అధికారులతో భేటీ అయ్యింది.
ఈ సందర్భంగా వివాదాస్పదమైన 400ఎకరాల భూమికి సంబంధించి న రికార్డులు, ప్రభుత్వ విధివిధానాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై పూర్తి వివరాల తో ఆ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నివేదిక అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశమై వివరాలు సేకరించారు.
ఆ తర్వాత తాజ్‌కృష్ణలో మాజీమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలతో భేటీ అయ్యారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై హరీశ్‌రావు బృందం వారికి వినతి పత్రాన్నందించింది. అనంతరం బీజేపీ నేతలతోనూ భేటీ అయ్యారు. కాగా కంచ గచ్చి బౌలి భూములపై వివాదాలను పరిశీలించి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన ఈ కమిటీ ఈ నెల16లోపు సుప్రీంకోర్టుకు తమ నివేదికను అందజేయాల్సి ఉంది.
ఆ 400ఎకరాల భూమి ప్రభుత్వానిదే సాధికారిక కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ మి ప్రభుత్వానిదేనని పర్యావరణ, అటవీశాఖ కేంద్ర సాధికారిక కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందజేసింది. కేంద్ర సాధికారిక కమిటీతో సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీజీపీ జితేందర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిరెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. 400 ఎకరాల భూమికి సం బంధించిన రికార్డులు, ప్రభుత్వ విధి విధానాలు, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి నివేదిక అందజేశారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం వివరాలు..
‘రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వేనెం.25లోని 2,324-.05ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ‘కాంచ అస్తబల్ పోరంబోకే సర్కారీ’ అంటే ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. 1975లో, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూవోహెచ్) కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వేనెం.25లోని మొత్తం భూమిని, ఇతర సర్వే నంబర్లను స్వాధీనం చేసుకుంది.
రెవెన్యూ రికార్డు ప్రకారం, అటవీ శాఖ ప్రకా రం, సర్వే నెం.25లోని భూమిని ఎప్పుడూ ‘ఫారెస్ట్’గా వర్గీకరించలేదు. అప్పటి ప్రభు త్వం 2003 ఆగస్టు 8న అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పం దం ప్రకారం.. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లి గ్రామంలో 450ఎకరాలను అప్పగించాలని ప్రతిపాదించింది.
ఒప్పందం ప్రకారం, ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి 534.-28 ఎక రాల పరిధిని తిరిగి ప్రారంభించింది. 400 ఎకరాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి, 134-.28 ఎకరాలను టీఎన్‌జీవోలకు అప్పగించింది. అప్పటి యూనివర్సిటీ ఆఫ్ హైద రాబాద్ రిజిస్ట్రార్ 2004 పిబ్రవరి 3న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా ద్వారా భూమిని అప్పగించారు.
పైనిర్ణయానికి బదులుగా, ప్రభుత్వం సర్వే నెం.36లో 191-.36ఎకరాలు, సర్వే నెం. 37లో 205.20 ఎకరాలు కలిపి మొత్తం 397 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించింది. దీనిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ అదేరోజు అంటే 2004 ఫిబ్రవరి 3వ తేదీన పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
ఈ 400 ఎకరాల విషయానికొస్తే యూవోహెచ్ ప్రభుత్వం నుంచి 397 ఎకరాలను తీసుకోవడం ద్వారా ఆ భూమిపై తన హక్కులను స్పష్టంగా వదులుకుంది. ఈ చర్య ద్వారా యూవోహెచ్ భూమిని ఐఎంజీకి బదిలీ చేయడానికి పూర్తిగా అంగీకరించింది. 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం టీఎన్‌జీవో కాలనీకి దారితీసే రహదారి ఏర్పాటు కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి జి ల్లా కలెక్టర్‌కు 2017 జనవరి1న ఒక మెమో జారీ చేసింది.
ఈ మెమో, దీనికి సంబంధించి చేపట్టిన పనులను యూవోహెచ్ వీపీ నెంబర్ 816/2021 ద్వారా హైకోర్టు ముం దు సవాలు చేసింది. ఈ 400 ఎకరాల భూ మిపై యూవోహెచ్‌కు ఎటువంటి హక్కులేదని, ప్రభుత్వచర్యను సవాలు చేయలేమని హైకోర్టు కొట్టివేసింది’ అని కేంద్ర కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
హెచ్‌సీయూ భూములే..! సాధికారిక కమిటీకి బీజేపీ ఎంపీల నివేదిక
కంచ గచ్చిబౌలి సర్వే నెం.25 లో ఉన్న 400 ఎకరాల భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)వేనని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు సంయుక్తంగా ఒక లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను గురువారం సాయంత్రం తాజ్‌కృష్ణలో కేంద్ర సాధికారిక కమిటీకి అందించి..అందులోని వివరాలను వెల్లడించారు.
హెచ్‌సీయూకు ఉన్న 2085.07 ఎకరాల భూమిని సంరక్షించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇం దుకు తగిన ఆధారాలను వారు కమిటీకి అం దించారు. సిక్స్‌పాయింట్ ఫార్ములాలో భా గంగా.. పార్లమెంట్‌లో చేసిన ప్రత్యేక చట్టం ద్వారా 1974లో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పడిందని ముగ్గురు ఎంపీల సంతకాలతో ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.
ఆ తర్వాత 1975లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న బీ రామచంద్రారెడ్డి కంచ గచ్చిబౌలి సర్వే నెం.25లోని 2,300 ఎకరాలతోపాటు మరికొంత భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించారని తెలిపారు. సర్వేనెం. 25తోపాటు ఇతర సర్వే నెంబర్లలో ఉన్న మొత్తం 2324.05 ఎకరాల భూమిని సెంట్ర ల్ యూనివర్సిటీకి (ఓఎస్డీకి) అప్పగించారని ఎంపీలు పేర్కొన్నారు.
అయితే తర్వాతి కాలంలో అప్పటి ప్రభుత్వాలు వివిధ సంస్థలకు కొంత కొంత స్థలా న్ని కేటాయించారని తెలిపారు. ఇందులో ప్రస్తుతం వివాదాస్పదమైన, ఐఎంజీ భరత్‌కు కేటాయించిన 400 ఎకరాల భూమి కూడా ఉందని ఎంపీలు తెలిపారు. దీనిని బట్టి 20.11.2012 నాటికి హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూమి 2185.07 ఎకరాలు అని స్పష్టం అవుతుందని, అందుకే ఈ భూమి మొత్తాన్ని హెచ్‌సీయూకే చెందేలా సంరక్షించాలని బీజేపీ ఎంపీలు కమిటీని కోరారు.
మీడియాతో బీజేపీ ఎంపీలు..
అనంతరం మీడియాతో బీజేపీ ఎంపీలు మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూ భూము లపై ఎందుకు సమీక్ష చేయలేదంటూ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారంటూ దుయ్యబట్టారు.
హెచ్‌సీయూ భూములను వేలం వేయకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది తామేనని బీజేపీ ఎంపీ ఈటల పేర్కొన్నారు. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామని, అలాగే భూములనుకూడా రక్షిం చుకుంటామన్నారు. ముఖ్యమంత్రికి ఇంగితజ్ఞానం ఉందా?.. సీఎంకు చట్టాలు వర్తించ వా? అంటూ ప్రశ్నించారు. 150 ఎకరాల్లో చెట్లను నరికేశారని ఈటల మండిపడ్డారు.