calender_icon.png 5 October, 2024 | 2:54 AM

ఢిల్లీ ఎల్జీకి సుప్రీం అక్షింతలు

05-10-2024 12:49:43 AM

మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేకాధికారాల వినియోగంపై ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను నిర్వహించడంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హడావుడి చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకునే ఓటింగ్‌పై స్టే విధించింది.

సెప్టెంబర్ 27 నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీలో ఆరో సభ్యుడి ఎన్నిక కోసం అత్యవసర నిబంధన విధించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో పదేపదే జోక్యం చేసుకోవాల్సిన అవ సరం ఎల్జీకి ఏముందని ఆయన తరఫు న్యాయవాది సంజయ్ జైన్‌ను కోర్టు ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా మాట్లా డుతూ.. ‘సెక్షన్ 487 ప్రకారం ప్రత్యేకించి స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నిక విషయం లో, దానిని అడ్డుకునే అధికారం మీకు ఎక్క డి నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించింది. ఎన్నికలను సవాల్ చేస్తూ ఒబెరాయ్ వేసిన పిటిషన్‌పై కోర్టు నోటీసులు జారీచేసింది.

పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు చైర్మన్ ఎన్నికను నిర్వహించవద్దని ఎల్జీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.  సెప్టెంబర్ 27న ఢిల్లీ మున్సిపల్‌కు సంబంధించి 18 మంది సభ్యు ల ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న స్థానాన్ని బీజేపీ అభ్యర్థి సుందర్‌సింగ్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికలను ఆప్, కాంగ్రెస్ పార్టీ లు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎల్జీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.