calender_icon.png 26 December, 2024 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమం నాటి అణిచివేతలు

19-10-2024 01:38:47 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ తెలంగాణ ఉద్యమం నాటి అణిచివేత చర్యలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అశోక్‌నగర్‌లో గ్రూప్ -1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని పేర్కొన్నారు.

ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో  పేర్కొంటూ సీఎం ఆదేశాలతో నిరుద్యోగులపై పోలీసులు జులం ప్రదర్శిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు అని చూడకుండా ఇంత దుర్మా ర్గంగా వ్యవహరించిన రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అశోక్‌నగర్‌కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్‌గాంధీ అధికారం చేపట్టిన తరువాత పత్తా లేకుండా పోయారని విమ ర్శించారు.

గ్రూప్-1 అభ్యర్థులకు అండ గా బీఆర్‌ఎస్ ఉంటుందని, అరెస్టు చేసి న విద్యార్థులను వెంటనే విడుదల చే యాలని యన డిమాండ్ చేశారు. కాగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీని శనివారం ఉదయం   కేటీఆర్ పరిశీలించనున్నారు.