calender_icon.png 19 October, 2024 | 7:52 AM

కార్పొరేషన్ చైర్మన్‌కు ఆసరా పింఛన్

28-07-2024 12:40:52 AM

  1. రూ.లక్షల్లో జీతానికి తోడు పింఛన్ అదనం 
  2. ‘ఉమ్మడి వరంగల్’కు చెందిన బీఆర్‌ఎస్ నేత నిర్వాకం 
  3. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

హనుమకొండ, జూలై 27 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఆయనో కార్పొరేషన్ చైర్మన్. సర్కార్ నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో జీతం తీసుకుంటాడు. ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రత్యేక వాహ నం, దానికి డ్రైవర్‌తో పాటు ఒక అంగరక్షకు డు తదితర సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు హైదరాబాద్‌లో ఉండేందుకు క్వార్టర్ సౌకర్యం సైతం ఉంటుంది. ఇన్ని సౌకర్యాలున్నా ఆయన ఆసరా కోసం కక్కుర్తి పడ్డారు. సర్కార్ నుంచి ప్రత్యేక కోటాలో ప్రతి నెలా రూ.4,016 పింఛన్ తీసుకున్నా రు. మన సర్కారే కదా.? అడిగేవారెవరూ అన్నట్లుగా ఎంచక్కా ప్రతినెలా పింఛన్ అందుకున్నాడు.

ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారట. కొత్తగా కొలువుదీరిన సర్కార్ ఆసరా పథకానికి నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా? అనే అం శంపై ఆరా తీస్తున్న క్రమంలో గులాబీ లీడర్ బాగోతం బయట పడినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈ లీడర్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 

లీడర్ బండారం బయటపెట్టనున్న మంత్రి సీతక్క..

ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశా లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆసరా పింఛన్లు మూడు నెలలకోసారి వస్తున్నాయని అనడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఒక నెల పింఛన్‌ను 2020 నుంచి పెండింగ్‌లో పెట్టిందన్నారు. మూడు నెలలుగా ఇవ్వ డం లేదన్నది అబద్ధమని తేల్చిచెప్పారు.

బీఆర్‌ఎస్ హయాంలో ఆసరా పింఛన్లలో గోల్ మాల్ జరిగిందని, బండారాన్ని బయటపెడతామని అసెంబ్లీ వేదికగానే స్పష్టం చేస్తామ ని సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ హయం లో ఏకంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆసరా పింఛన్ తీసుకున్నారని మంత్రి తెలిపారు. రెండురోజుల్లో ఈ విషయాన్ని అసెం బ్లీ సాక్షిగానే బయటపెడతానన్నారు. దీంతో ఎవరా కార్పొరేషన్ చైర్మన్ అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన నాయకుడని ప్రచారం జరిగింది.