calender_icon.png 6 March, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభ్యున్నతికి తోడ్పాటు

06-03-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్, మార్చి 5 (విజయక్రాంతి): మహిళల అభ్యున్నతికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శంషాబాద్ లోని వై ఎన్ ఆర్ గార్డెన్ లో సిరి స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారన్నారు. అన్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలను, అన్యాయాలను ఎదుర్కొనేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే మహిళలు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  నేతలు గణేష్ గుప్తా, మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, సిరి స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.