calender_icon.png 24 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత విద్య అభివృద్ధికి ఎంతో కృషి

24-04-2025 06:43:37 PM

10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి..

బాన్సువాడ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యకు తోడ్పాటు..

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో బాన్సువాడలో గత 25 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు కళాశాలలో 13000 మంది విద్యార్థులు చదువుకోగా పదివేల మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయని ఆయన తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లోని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

కళాశాల ఏర్పాటు చేసిన నుంచి గత సంవత్సరం వరకు 13,050 మంది విద్యార్థులు పట్టబద్రులు అయితే అందులో పదివేలకు పైగా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. మిగతా 3000 మంది ప్రైవేట్ రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. 1994 సంవత్సరంలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు నాయకుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరమని గ్రహించి అప్పటి ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఒక సంవత్సరం పాటు కష్టపడితే 1997లో కళాశాల సాంక్షన్ చేస్తూ జీవో విడుదల అయిందా అన్నారు. 28 ఆగస్టు 1998 లో అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాశాలను ప్రారంభించుకున్నామని తెలిపారు.

ఈ కళాశాల జీవో వచ్చిన తర్వాత స్థలం కోసం చూస్తుండగా అప్పట్లో ఈ స్థలంలో శ్రీ రామ్ నారాయణ కేడిఆర్ ఫ్యాక్టరీ ఉండేదని కళాశాల గురించి వారికి తెలుపగానే వారి ఫ్యాక్టరీ స్థలం సుమారు 12 ఎకరాల స్థలాన్ని కళాశాల నిర్మాణం కోసం ఉచితంగా విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు, అందుకే ఈ కళాశాలకు ఆయన పేరు శ్రీ రామ్ నారాయణ కేడిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఈ కళాశాల స్థాపించినప్పటి నుండి ఈ కళాశాలలో పనిచేసిన అధ్యాపకులు ప్రిన్సిపల్ చాలా పట్టుదలతో పని చేశారని తెలిపారు. ఇప్పుడు ఈ కళాశాలలో 42 మంది టీచింగ్ స్టాఫ్ 19 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ మూడు కంప్యూటర్ ల్యాబ్స్ 12 సైన్స్ ల్యాబ్స్ 52 క్లాసులు అన్ని అంగులతో ఈ డిగ్రీ కళాశాల కొనసాగుతుందని తెలిపారు.

ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ... ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సంకల్పంతో ఈ ప్రాంత పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఈ కళాశాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అన్ని అంగులతో అన్ని రంగాల్లో ఈ కళాశాలను అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇప్పటితోనే ఆగకుండా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కొనసాగే విధంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొనాలని ఈ పరంపర భవిష్యత్తులో ఉండే నాయకులు అధ్యాపకులు విద్యార్థులు కష్టపడి శ్రమించి ఈ కళాశాల పేరును ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ అక్క మాట్లాడుతూ... బాన్సువాడలో ఎస్ ఆర్ ఎన్ కె కళాశాల అభివృద్ధికి పోచారం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. స్థలదాత ఆయన కేడియా వల్లే ఎంత గొప్ప కళాశాల ఏర్పాటు చేయడానికి సాధ్యమైందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు.

కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ముందుగా కాశ్మీర్లో తీరవాళ్ళతో కాల్పుల్లో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సన్మానించారు. తెలుగులో పిహెచ్డి చేసి కౌలపై పరిశోధనాత్మక పుస్తకం రచించిన అఫీన్ తన పుస్తకాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అసీస్ సంఘం రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్ మై, కేడియా మనుమడు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు.