calender_icon.png 18 March, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత వృత్తిని ఆదుకోరూ!

18-03-2025 12:52:35 AM

బెల్ట్ షాపులతో తగ్గిన ఉపాధి రక్షణ కిట్లు, వాహనాలు కరువు ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి

కల్లూరు, మార్చి 17 (విజయ క్రాంతి ) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాటి కల్లు కు ఆదరణ ఉన్నా గీత కార్మికులకు ప్రభుత్వ పరంగా  సరైన ప్రోత్సాహం లభించడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ పరంగా లభించాల్సిన సౌకర్యాలు పరిమితం కావడంతో గీత కార్మిక కుటుంబాలు ఇబ్బం దు లు పడుతున్నాయి.

సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి,కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వేంసూరు తదితర మండలాల్లో వేలాది గీత కార్మిక కుటుంబాలు గీత వృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. వృత్తికి సంబందించిన కాటమయ్య రక్షణ కిట్లు నేటికీ అందరికీ అందలేదు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా వృత్తిదా రులకు అందాల్సిన వాహనాలు, రుణాలు సక్రమంగా అందక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

అలాగే ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి కల్లు విక్రయాలు చేస్తుండడంతో ఇబ్బందికరంగా తయారైంది. కల్లూరు మండ లం రఘునాధ బంజర గ్రామ పంచాయతీ లో ఎక్కువ శాతం మంది ఈ వృత్తినే కుల వృ త్తిగా చేసుకుని జీవిస్తున్నారు.

ఎక్కువ శాతం మంది కల్లు అమ్మి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే మారిన పరిస్థితుల ప్రభావం వల్ల వృత్తి పరంగా జీవనోపాది తగ్గి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని గీత కార్మికులు బండి లక్ష్మణ్, కుక్కా బజార్ తెలిపారు..ఆరోగ్య పరంగా కల్లు మంచిదని నిపుణులు చెబుతున్నారని అన్నా రు.

స్వచ్ఛమైన కల్లులో పుష్కలంగా విటమిన్లు ఉండ డం వల్ల వేస లో ఎక్కువుగా ఇష్టపడి సేవిస్తుంటారని, ప్రభుత్వం స్పందించి కాటమయ్య రక్షణ కిట్లు, వాహనాలు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. గీత కార్మిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. 

ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాల ని బండి లక్ష్మణ్, కుక్కా బజార్, కుక్కా మాధవరావు కోరుతున్నారు.