19-04-2025 01:30:58 AM
జస్టిస్ లక్ష్మణ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 18: ఎండలు మండుతున్న నేపథ్యంలో పిట్టలకు, ఇతర మూగ జీవాలకు నీటిని అందించే కార్యక్రమానికి అత్తాపూర్ డివిజన్ చింతకుంట పార్క్ వాకర్స్ శ్రీకారం చుట్టారు. జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండాకాలంలో పక్షులు, ఇతర ప్రాణుల దాహార్తిని తీర్చడానికి వాకర్స్ స్వచ్ఛందంగా నీటి తొట్టెలు, వాటర్ పాట్స్, విస్తృతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ వంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలకు పౌర సమాజం సహ కరించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ మేడం మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, వాకర్స్, పుర ప్రముఖులు నల్లింగ్ రమేష్ ,సుబ్బరాజు, జైతారం జగన్మోహన్ రెడ్డి, నర్సింలు, బీట్కూరి సతీష్, సురేందర్, మల్లేష్, ఏం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.