13-03-2025 01:23:34 AM
ఖమ్మం, మార్చి 12( విజయక్రాంతి ): తెలుగు భాష అద్భుతమైన జీవద్భాష, సరళంగా,ఒత్తుల్లేకుండా రాయడానికి ఆస్కారమున్నదని, భాషా పరిశోధకులు, తెలుగు ఉపాధ్యాయులు చంద్రగిరి వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం స్థానిక ఎస్ ఆర్ బి జి ఎన్ ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డా.మొహ్మద్ జాకిరుల్లా అధ్యక్షతన తెలుగు లిపి -సరళత ఒత్తుల్లేకుండా... ఒత్తిడి లేకుండా తెలుగు రాయడం అనే అంశంపై నిర్వహించిన విస్త్రృతోపన్యాసం లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.భాషలో లిపి మారుతున్న క్రమం లో అంతర్గతంగా ఒత్తులు వల్లనే భాష కష్టతరంగా మారుతున్నదని తెలిపారు. తాను పరిశోధనాత్మకంగా గుర్తించిన లిపి పరిణామ క్రమాన్ని విద్యార్థులకు వివరించారు.
ఒత్తులో శబ్దం లేదని తెలిపారు. ఒత్తులకు స్థానలోపం కారణంగానే, భాషకు సంక్లిష్టత ఏర్పడుతుందని వరించారు. మాత్రృభాషకు చిట్టచివరి వారసులు కావొద్దని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి డా.పి., రవికుమార్ వైస్ ప్రిన్సిపాల్స్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డా.బానోత్ రెడ్డి, సీనియర్ తెలుగు అధ్యాపకులు, డా.సీతారాం, తెలుగు విభాగం అధ్యాపకులు డా.జె.అనురాధ, డా.కిరణ్, కోటమ్మ, డా.ఎం.వి.రమణ, డా.కె.కార్తీక్, శ్రీనివాస్, వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.