హైదరాబాద్: సామజిక మాధ్యమల్లో మార్కెటింగ్ అంశాలపై వస్తున్న కథనాలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Tummala Nageshwar Rao) ఆరా తీసారు. గత రెండు రోజులుగా జరిగిన సంఘటనపై మంత్రి తుమ్మలకు మార్కెటింగ్ శాఖ(Marketing department) అధికారులు వెల్లడించారు. రైతులు మార్కెట్లకు తీసుకువచ్చిన తమ పంటలకు గిట్టుబాటు ధర పొందేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం జరగకుండా క్రయ, విక్రయాలు జరిగేటట్లు చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టు ఉన్న పంటలకు మద్దతు ధర అందించాలని, వ్యవసాయ మార్కెట్లకు ప్రత్యేక బృందలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లకు పంపాలని మంత్రి సూచించారు. ప్రతి అధికారి బాధ్యత తీసుకోవాలని, మార్కెటింగ్ డైరెక్టర్ ప్రాంతీయ, జిల్లా అధికారులకు మంత్రి అదేశాలు ఇచ్చారు.