calender_icon.png 5 November, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తికి మద్దతు ధర కల్పించాలి

05-11-2024 03:40:49 AM

ఖమ్మం పత్తి మార్కెట్ ఎదుట రైతుల ధర్నా 

ఖమ్మం, నవంబర్ 4 (విజయక్రాంతి): పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు దళారుల ఆటలను కట్టించాలని కోరుతూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం పత్తి మార్కెట్ యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం నాయకులు మాట్లాడు తూ.. దళారులు పత్తికి గిట్టుబాటు ధర చెల్లించకుండా క్వింటాల్‌కు కేవలం రూ.5వేల నుంచి రూ.6 వేలు చెల్లిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వ్యాపారులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారులంతా కుమ్మక్కై నాణ్యత పేరుతో రైతులను అందినకాడికి దోపిడీ చేస్తున్నారని నాయకులు వాపోయారు. 20రోజుల నుంచి ఖమ్మం పత్తి మార్కెట్‌కు వేల క్వింటాళ్ల పత్తి వచ్చిందని.. ఎన్నడూ మద్దతు ధర వచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి రైతుకు మద్దుతు ధర చెల్లించాలని లేకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతు సంఘాల నేతలు అచ్చయ్య, వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. 

తేమ సాకుతో ఇబ్బంది పెట్టొద్దు

ఆదిలాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): పత్తిలో తేమ శాతం పూర్తిగా మినహా ఇస్తూ మద్దతు ధర ఇవాలని, తేమ సాకుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని అఖిల పక్ష రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశా రు. అఖిల పక్ష రైతు సంఘం ఆధర్యంలో ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవనంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిరహించారు. ఈ సందర్భంగా పలు అం శాలపై తీర్మానాలు చేశారు. పత్తికి మద్దతు ధర కల్పించి, రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుతాలను డిమాండ్ చేశారు. మార్కెట్ అధికారులు సీసీఐ, ప్రవేట్ వ్యాపారులు కుమ్మక్కయ్యి రైతులను నట్టేట ముంచుతున్నారని ధజమెత్తారు. మద్దతు ధర ఇప్పించడంలో అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో అఖిల పక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ, రోకండ్ల రమేష్, కొండా రమేష్, లోకారి పోశెట్టి, లక్ష్మణ్, లంకా రాఘవులు, వెంకట్ నారాయణ, జగన్, సురేష్, పూసం సచిన్, సామి పాల్గొన్నారు.