calender_icon.png 31 January, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్చికి 25వేల మద్దతు ధర ఇవ్వాలి

31-01-2025 01:00:24 AM

నాగర్ కర్నూల్, జనవరి 30 (విజయ క్రాంతి): మిర్చి పంటకు క్వింటాలకు 25వేల మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   గురు వారం ఆ సంఘం  కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో మాట్లాడారు. 

జిల్లా లోని పదర, అమరాబాద్, అచ్చంపేట, తెలక పల్లి తాడూరు, బిజినాపల్లి, నాగర్ కర్నూల్ మండలాలలో మిర్చి పంట రైతులు అధికం గా సాగు చేశారని మిర్చి సాగు చేసే సమ యంలో అధిక వర్షాలతో తెగులు సోకి దిగు బడి తగ్గి రైతులు దిగాలుగా ఉన్నారని గుర్తు చేశారు.

పంటను అమ్ముకోవడానికి మార్కె ట్ తీసుకువెళితే మధ్య దళారుల కారణంగా పది వేలకు మించి ధర పలకడం లేదని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు శివశంకర్, శివ రాములు పాల్గొన్నారు.