calender_icon.png 12 March, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణకు అన్నివర్గాల మద్దతు

03-02-2025 01:12:54 AM

  • ‘లక్ష డప్పులు గొంతుకలు’ను విజయవంతం చేయండి
  • ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ 

ముషీరాబాద్, ఫిబ్రవరి 2: ఫిబ్రవరి 7న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే ‘లక్ష డప్పు లు గొంతుకలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్య క్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందన్నారు.

భారత రాజ్యాంగం సూచించిన ప్రకారం  మాల, మాదిగ, ఉపకులాలకు సమాన పం పిణీ జరగాల్సిందేనని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ రిపోర్టును విడుదల చేసి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చే యాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.

అందుకోసం ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మోత మోగిస్తున్నట్లు చెప్పారు. మా దారులు వేరైనా లక్ష్యం ఒక్కటేనని వం గపల్లి తెలిపారు. ఫిబ్రవరి 7న జరిగే కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 6న తాము ఇందిరాపార్క్‌లో నిర్వహించతలపెట్టిన దీక్ష కార్యక్రమాన్ని విరమిం చుకుంటున్నట్లు తెలిపారు.

మందకృష్ణ మాదిగకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమా వేశంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ ప్రతినిధులు కర్నే రామారావు, అశోక్, శ్రీనివాస్, పరమేశ్వర్, తిప్పన్న, సంపత్ పాల్గొన్నారు.