calender_icon.png 17 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంగ మహేందర్‌రెడ్డికి మద్దతు

17-01-2025 12:53:16 AM

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): త్వరలో జరిగే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మద్దతు తెలిపినట్టు పీఆర్టీయూటీఎస్ సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి తెలిపారు.

సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ అంజయ్య, దానయ్య ఈ మేరకు లేఖను అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. పీఆర్టీయూ సంఘం అభ్యర్థి గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని ఎస్సీఎస్టీ టీచర్ సంఘం నేతలు తెలిపారు.