నల్లగొండ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ, జనవరి 28 (విజయక్రాంతి) : పదవులున్నా లేకున్నా నల్లగొండ పట్టణాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని విద్యానగర్ పార్కులో తాజామాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేశ్‌గౌడ్ దంపతులను ఆయన సన్మానించి మాట్లాడారు.
మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నల్లగొండలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో పనిచేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, విద్యానగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.