calender_icon.png 22 February, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘క్రిటికల్’ మైనింగ్‌లో సింగరేణికి సహకారం

26-01-2025 12:00:00 AM

సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్‌తో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి

హైదరాబాద్, జనవ రి 25, (విజయక్రాంతి): బొగ్గు మైనింగ్ రంగం లో సుదీర్ఘ అనుభము న్న సింగరేణి కాలరీస్ లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ రంగం లోనూ ప్రవేశించేందు కు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోం ది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సమక్షంలో ఇటీవల ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పం దం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ ఒప్పందానికి కొనసాగింపుగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఐఐ టీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి నేతృత్వం లో ప్రొఫెసర్ల బృందం సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నేతృత్వం లో డైరెక్టర్లు, సీనియర్ మైనింగ్ అధికారులతో  ప్రత్యేకంగా సమావేశమైంది.

క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సింగరేణి చేస్తున్న ప్రయ త్నాలకు  హైదరాబాద్ ఐఐటీ పూర్తి సహకారం అందిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు.