03-03-2025 01:10:32 AM
మేడిపల్లి, మార్చి 2 (విజయక్రాంతి): ఆరోగ్య వంతమైన తెలంగాణ నిర్మాణానికి రాచకొండ రన్నర్స్‘ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆరోగ్యరన్ -2025‘ ఈవెంట్ తోడ్పడుతుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఏవీ కన్స్ట్రక్షన్, ది ఆనంద ఇన్ఫినిటి జాయ్, విజయరత్న స్కూల్, సహస్రం డవలపర్స్ వారి సౌజన్యంతో నారపల్లి లోని భాగ్యనగర నందనవనం రిజర్వు ఫారెస్ట్ లో రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్యరన్ -2025 ఈవెంట్స్ ను మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 2k, 5k, 10k రన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన రన్నర్స్ కు మెడల్స్ ను బహూకరించడం జరిగింది.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, నిర్వాహకులు ప్రభాకర్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవెళ్లి రఘువర్ధన్ రెడ్డి, బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల,జావీద్ ఖాన్,నర్సింహా, శ్యామల నర్సింహా, కిరణ్ నాయక్, రమేష్, శంకర్ రావు, మామిడి శ్రీధర్, ఆరోగ్య రన్ స్పాన్సర్స్ తో పాటు సుమారు 800 మంది పాల్గొన్నారు.