calender_icon.png 9 January, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభావంతులైన విద్యార్థులకు తోడ్పాటు

31-12-2024 01:33:50 AM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, డిసెంబర్30 : జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని జిల్లా కలెక్టర్; కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం  కలెక్టర్ జిల్లా కలెక్టరే ట్‌లో తన చాంబర్‌లో  ప్రతి భావంతుడైన ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ రావుకు కాంపౌండ్‌బో పంపిణీ చేశారు.

రామగుం డం నగరానికి చెందిన ధీరజ్‌రావు  జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఆర్చరీ తనకు కాంపౌండ్‌బో కావాలని  కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి దరఖాస్తు పరిశీలిం చిన జిల్లా కలెక్టర్  4 లక్షల 43 వేల 300 రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థి నికి అవసరమైన కాంపౌండ్ బో కొనుగోలు చేసి నేడు పంపిణీ చేశారు.

విద్యార్థిని భవిష్యత్తులో ఆర్చరీలో గొప్ప క్రీడాకారిణీగా ఎదగాలని,  అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తోడ్పాటు జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువ జన క్రీడా శాఖ అధికారి సురేష్, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి కొమ్ము రోజు శ్రీనివాస్, పేట సంఘం జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు వి సురేందర్, డి రమేష్, ధీరజ్ రావు తల్లిదండ్రులు, తదితరులు పాల్గోన్నారు.