ముషీరాబాద్, జనవరి 20: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ డీఎస్‌పీ మదనం గంగాధర్ గెలుపునకు తాము మద్దతునిస్తున్నామని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ కిరణ్‌కుమార్ మాదిగ, సామాజిక పరివర్తకులు, నేషనల్ పొలిటికల్ పార్టీ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్, భారతీయ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ దయానందరావు తెలిపారు. సోమవారం బర్కత్‌పుర సామాజిక భవన్‌లో వారు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా మదనం గంగాధర్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.