calender_icon.png 19 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి

12-07-2024 01:46:04 AM

ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్

హైదరాబాద్, జులై 11(విజయక్రాంతి) : పర్యావరణ పరిరక్షణ అనే ది చట్టం కోసం చేసేది కాదని, అదొ క నైతిక బాధ్యత అని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రెసిడెంట్  మీలా జయదేవ్ పేర్కొన్నా రు. గురువారం ఎఫ్‌టీసీసీఐకి చెంది న పర్యావరణ కమిటీ రెడ్ హిల్స్‌లోని సురానా ఆడిటోరియంలో ప ర్యావరణ నిర్వహణపై పారిశ్రామిక వేత్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం పరిశ్రమలపై పెరుగు తున్న బాధ్యతను అందరూ గుర్తించాలన్నారు. పారిశ్రామికీకరణ వల్ల గణనీయమైన పర్యావరణ సవాళ్ల ను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన  సమాజాన్ని అందించడానికి కృషి చే యాలని సూచించారు. కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్ మెట్లపల్లి శ్రీనివాసులు, జీ బాల సుబ్రమణ్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, మేనేజర్లు పాల్గొన్నారు.