సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ వినతి
ముషీరాబాద్, ఆగస్టు 27: బీసీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో బీసీ సంఘం నాయకులు నందగోపాల్, వేముల రామకృష్ణ, ఉదయ్‌తో కలిసి కూనంనేనికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గుజ్జకృష్ణ మాట్లాడుతూ.. బీసీ బిల్లు పెట్టడంతో పాటు దేశ వ్యాప్తంగా బీసీల కులగణన చెపట్టాలని కోరారు. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖను కేటాయించాలని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న లక్డీకాపూల్‌లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా కోరారు.