calender_icon.png 7 February, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్లను ఆదుకోండి

11-12-2024 12:00:00 AM

ఒకవైపు కొత్త ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను జరుపుకుంటుంటే మరోవైపు ఆశా వర్కర్లు ఏడాది అవుతున్నా తమకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచనందుకు ఆందోళన చేయడం దురదృష్టకరం. హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట సోమవారం వారు చేసిన ధర్నా ఉద్రిక్తతలతో పలువురి అరెస్టుకు దారితీసింది.

పోలీసులు మహిళలని కూడా చూడకుండా వారిని బలవంతాన వాహనాలలోకి తరలిస్తున్న సమయంలో కొందరు సొమ్మసిల్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విషయం. కనుక, వారి జీతాలను రూ.18,000కు పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవడం మంచిది. 

 రాధారాణి, శామీర్‌పేట