15-12-2024 12:00:00 AM
గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు చేసిన సమ్మెకు తలొగ్గి నిర్దిష్టమైన హామీలు ఇచ్చింది. కానీ, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని ఏ ఒక్కటికూడా అమలు చేయలేదు. వేతనం రూ.18,000 చేస్తానని, 65 సంవత్సరాలు నిండిన టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష ప్రోత్సాహకంగా ఇవ్వగలమనీ గత ప్రభుత్వం ప్రకటించింది.
గత ఆరు నెలలనుంచి 60 సంవత్సరాలు నిండిన టీచర్లకు, ఆయాలకు ఆ పథకం ఇంకా అందుబాటులోకి రాలేదు. ‘పని బారెడు జీతం చారెడు’ అన్నట్లు గా ఉంది. ప్రతి నెల సెక్టార్, ప్రాజెక్టు మీటింగ్‌లు వంటివాటికి సొంత ఖర్చులతోనే వెళ్లాలి. చాలా గ్రామాలలో వారు చెల్లించే ఇంటి కిరాయిలకన్నా ఓనర్లు అధికంగా వసూలు చేస్తున్నారు. వారికి వచ్చే వేతనం నుంచి వాటిని చెల్లించాల్సి వస్తున్నది.
ప్రతిదీ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా వీరు పని చేయాలి. ఇంతేకాదు, వీరు ప్రతి గ్రామంలో మస్కూరిలాగా ఆయా ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్తులవుతున్నారు. 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అంగ న్‌వాడీలకు కూడా వేతనంలో తేడా లేదు. పదవీ విరమణ తర్వాత సామాజిక పెన్షన్‌కూ అర్హులో కాదో తెలియడం లేదు. కొందరి పెన్షన్లు కూడా రద్దు చేశారు.
ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అంగన్‌వాడీలకు సరైన వాటా ఇవ్వట్లేదు. ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అంగన్‌వాడీలపట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇకనైనా మానవతా దృక్పథంతో సమస్యలను అర్థం చేసుకొని, వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలి.
-ఉమారాణి వైద్య