calender_icon.png 30 September, 2024 | 6:12 AM

నేతలకు అమ్మాయిల సప్లు

30-09-2024 12:35:24 AM

నేరాన్ని అంగీకరించిన యూఎస్ మహిళ

పొలిటీషియన్స్, సైనికాధికారులకు యువతులను సప్లు చేసినట్లు వెల్లడి

వాషింగ్టన్ (అమెరికా), సెప్టెంబర్ 29: వర్జీనియా, మసాచూట్స్ సహా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో సెక్స్ రాకెట్ నడిపినట్లు ఒక అమెరికన్ మహిళ తన నేరాన్ని అంగీక రించింది. ఈ మేకు జున్‌మ్యుంగ్ లీ(31), ఆమె పార్టనర్లు.. హాన్‌లీ (42), జెమ్స్ లీ (69) శుక్రవారం బోస్టన్ ఫెడరల్ కోర్టులో జడ్జి ముం దు నేరాన్ని అంగీకరించారు.

తాము ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు, లాయర్లు, కార్పొరేట్ వ్యాపారవేత్తలకు యువతులను సప్లు చేసేవారమని వారు తెలిపారు. ముఖ్యంగా యూఎస్‌లో ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆసియాకు చెందిన యువతులను వారు సంప్రదించి ఈ వ్యభిచార కూపంలోకి దింపిన ట్లు పోలీసులు వెల్లడించారు.

అయి తే మేము ఏ మహిళను బలవంతంగా వ్యభిచారం చేయమని అడిగే వారం కాదని.. వారంతట వారే తమ టీమ్‌లో చేరే వారని వారు చె ప్పడం గమనార్హం. మహిళలకు అవసరమైన విమాన ప్రయాణం, బస తదితర ఏర్పాట్లన్నీ చేసేవారమని తె లిపారు.

తమ సెక్స్ రాకెట్‌కు సంబంధించి రెండు వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చి కస్టమర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారమని.. కస్టమర్ల నుంచి కేవలం నగదు మాత్రమే తీసుకునే వారమని వారు తెలిపారు. అయితే వారి కస్టమర్లు ఎవరు అనేది మాత్రం నిందితులు తెలపలేదు.