07-04-2025 03:07:32 PM
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) కు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో నకిలీ పత్తి విత్తనాలను అమాయక రైతులకు అంటకడుతున్నారన్నారు.
మే, జూన్ నెలలోనే రైతులు విత్తనాలు కొనుగోలు(Fake cotton) చేస్తారనీ జిల్లా పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ లు పకడ్బందీగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు గ్రామ స్థాయిలో కార్డన్ సెర్చ్ లు చేపట్టి అక్రమాలను అరికట్టాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ , పోలీసులు,వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నకిలీ విత్తనాలని పూర్తిగా అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొట్టుపల్లి సాయికృష్ణ, పిప్పిరి సమ్మన్న, టోబ్రే శ్రీకాంత్, నరేష్ తదితరులు ఉన్నారు