- జిఎం పర్సనల్ బదిలీ ఆర్డర్‌లకు విలువ లేదా?
- ఆర్‌జీ1 సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఇష్టారాజ్యం
- రాజకీయ జోక్యంతో ఆగుతున్న ఉత్తర్వులు
- గనిలో దిగే కార్మికులకు ఒక రీతి... కార్యాలయంలో పాతుకుపోయిన ఉద్యోగులకు మరో రీతా..?
గోదావరిఖని, జనవరి 9: సింగరేణి రామగుండం -1 డివిజన్‌లోని సివిల్ డిపా ర్ట్మెంట్ లో సీనియర్ సూపర్వుజర్ లు చాలా ఏళ్లుగా ఇక్కడే పాతుకు పోతున్నారు. సివిల్ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు రుచి మరిగి బదిలీలు జరగకుండా స్థానిక అధికారులను మచ్చిక చేసుకుని అవసరమైతే చేతులు తడిపి తమ సీట్లను పదిలం చేసుకుంటు న్నారు. ఎంతలా అంటే... కార్పొరేట్ కార్యాల యం నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చిన వాటిని బేఖాతరు చేస్తూ ఇక్కడే పదిలంగా ఉంటున్నారు.
కార్పొరేట్ కార్యాలయం జిఎం పర్సనల్ అధికారి నుంచి వచ్చిన బదిలీ ఉత్తర్వులను స్థానిక సివిల్ అధికారు లు అమలు పరచకుండా యాజమాన్యం కు తెలియకుండా బదిలీ అయిన ఉద్యోగులు ఇక్కడే కొనసాగేలా సహకరిస్తున్నారన్న ఆరోపణలు సివిల్ డిపార్ట్మెంట్ లో ఇటీవల కాలంగా వివాదాస్పదంగా మారుతున్నా యి. రాజకీయ నాయకుల జోక్యం వల్లనే తాము ఏమి చేయలేకపోతున్నామని కార్పొ రేట్ స్థాయి అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.
గనుల్లో కి దిగి బొగ్గును వెలికి తీసే కార్మికులకు ఒక రీతి.. కార్యాలయంలో కూర్చొని రాజ భోగాలు అనుభవించే ఉద్యోగులకు మరో రీతా అన్నా సందేహాలు కార్మికులను వెంటాడుతున్నాయి. రెండు నెలల క్రితం సింగరేణి వ్యాప్తంగా ఆయా డివిజన్ లోని సివిల్ డిపార్ట్మెంట్ లో లాంగ్ స్టాండింగ్‌లో పనిచేస్తున్న సీనియర్ సూప ర్వుజర్ లను 14 మందిని కొత్తగూడెం కార్పొరేట్ జీయం పర్సనల్ బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నవంబర్ 20వ తారీకు లోపు ఆయా ఏరియా నుంచి రిలీవ్ ఆర్డర్ తీసుకొని బదిలీ అయిన స్థానాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంస్థవ్యాప్తంగా అన్ని ఏరియాలలో బదిలీ ఉత్తర్వులు అమలు కాగా, రామ గుండం-1 డివిజన్‌లోని సివిల్ డిపార్ట్మెంట్ లో మాత్రం అమలు కావడం లేదన్న ఆరోప ణలు వస్తున్నాయి. ఉత్తర్వులు వెలువడి రెండు నెలలు గడిచిన రిలీవ్ చేయకపోవడం తో పలు అనుమానాలకు తావిస్తున్నది.
స్థానిక సివిల్ అధికారుల నుంచి మొదలు కొని కార్పొరేట్ స్థాయి అధికారుల వరకు భారీ మొత్తంలోనే ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవ హారం సింగరేణి సంస్థ సిఅండ్ ఎండి దృష్టికి వెళ్లినప్పటికీ, యాజమాన్యంను కూడా పక్కదోవ పట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నట్లు కాంట్రాక్టర్లు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇక్కడి సివిల్ డిపా ర్ట్మెంట్ లో ఇంత జరుగుతున్న అర్జీ -1 జిఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తు న్నారు.
సివిల్ డిపార్ట్మెంట్ లో అధికారుల నిర్లక్ష్యమా? లేక ఆమ్యామ్యాలకు తలోగ్గి బదిలీలు జరగకుండా సహకరిస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే గోలేటి ఏరియా నుంచి ఓ సీనియర్ సూపర్వుజర్ ఇక్కడ డిపార్ట్మెంట్ కు బదిలీ కాగా, అతనికి అక్కడ రిలీవ్ ఆర్డర్ ఇవ్వ కుండా అధికారులు కావాలనే జాప్యం చేస్తు న్నట్లు తెలిసింది.
భూగర్భగణిలోకి దిగి నల్ల బంగారం వెలికి తీసే గని కార్మికులు ఒకే గనిలో లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తూ ఏమై నా ఆరోపణలు వస్తే ఆగ మేఘాల మీద అధికారులు ట్రాన్స్ఫర్ కొడతారు. తర్వాత కార్మికులు బదిలీ అయిన చోటుకు వెళ్లకుంటే సంస్థపరమైన చర్యలు తీసుకుంటారు.
కానీ అర్జీ -1 సివిల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే చాలాకాలంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను పైనుంచి యాజమాన్యం బదిలీ చేసిన... ఆ ఉత్తర్వుల ను పెడచెవిన పెట్టి నెలరోజులు దాటిన ఇక్కడే భాజాప్తిగా పనిచేస్తున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే కార్మికుల్లో చర్చనీయాంశంగా మారింది.