calender_icon.png 4 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ

04-03-2025 06:39:40 PM

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని జగదాంబ తండాలో నడుస్తున్నటువంటి ఉపాధి హామీ పనులను మండల పంచాయతీ అధికారి రాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ పనులకు పేదవారు అందరూ ఉపయోగించుకునేలా కూలీల సంఖ్య పెరిగేలా చేయాలని, అలాగే కూలీల నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలని సూచించారు. అలాగే వేసవికాలం నేపథ్యంలో నీటిని వృధా కాకుండా చూసుకోవాలని, నీటి ఎద్దడి రాకుండా నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని, పల్లె ప్రకృతి వనాలలో చెట్లు ఎండిపోకుండా కాపాడుకోవాలని సిబ్బందిని సూచించారు.