calender_icon.png 2 April, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌లో సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ సందడి

01-04-2025 02:53:21 AM

ఖలీని సత్కరించిన ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, మార్చ్ 31 (విజయ క్రాంతి) : డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ సోమవారం ఆదిలాబాద్ లో సందడి చేశారు. కరీంనగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరై ముంబాయికి తిరుగు ప్రయాణంలో వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఆదిలాబాద్ లోని బీజేపీ నేత ఆదిత్య ఖండేష్కర్ గెస్ట్ హౌస్‌లో కాసేపు సేద తీరారు.

ఖలీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న పట్టణ యువకులు, ఆయన అభిమా నులు ఆయన్ని కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ది గ్రేట్ ఖలీ తో రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, యువకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ది గ్రేట్ ఖలీని కలిశారు. ఈ సందర్భంగా ఆయ న్ని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఖలి ఆదిలాబాద్‌కు రావడం పట్ల హర్షం ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రేట్ ఖలీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌తో తనకు పాత అనుబంధం ఉందని తెలిపారు. ఆదిత్య ఖండేష్కర్ తనకు మంచి మిత్రుడని, గతంలో పలుమార్లు ఆదిలాబాద్‌కు వచ్చి న తనకు ప్రజల ఆదరాభిమానం ఎంతగానో నచ్చిందన్నారు. చుట్టుపక్కల ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఆదిలాబాద్ కు తప్పకుం డా వస్తానని పేర్కొన్నారు.