రుచికి.. రుచి, ఆరోగ్యానికి.. ఆరోగ్యం.. రెండు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారంలో ఈ రెండు సమతుల్యంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కొవిడ్ తర్వాత చాలా మందికి ఆరోగ్యం, ఆహారంపట్ల ఆసక్తి పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను రుచిగా వండుకోవడం అసాధ్యం. కానీ బాగా ప్లాన్ చేస్తే మాత్రం ఉప్పు, నూనె లేకుండా సూపర్ టేస్టీ గా ఆహారపదార్థాలను తినవచ్చు అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం..
ప్రతిదీ నూనెలో వేయిస్తే.. రుచిగా ఉంటుందని.. ఉప్పు సరిపడా వేస్తేనే కూరలు టేస్టీగా ఉంటాయని నమ్ముతుంటారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. కొన్ని ఆహారపదార్థాలను ఉప్పు, నూనెలో లేకుండా మసాలా దినుసులతో గార్నిష్ చేసుకొని తింటే రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నాయి పరిశోధనలు. ఉదాహరణకు ఉడకపెట్టిన గుడ్డుపై, జాయకాయ ముక్కలపై మిరియాల పొడి చల్లుకోవడం, చాయ్‌లో చక్కెరకు బదులుగా బెల్లం, అల్లం ముక్క వేసుకోవడం, స్వీట్స్‌లో చక్కెరకు బదులుగా డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించడం, ఆకుకూరలపై చీజ్, ఎండు మిరపకాయ పొడి చల్లుకొని తినడం వంటివి. ఈ మసాలా దినుసులు వేల సం వత్సరాలుగా ఆహారంలో భాగంగా వాడుతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని మసాలా దినుసులు రోగాలను నయం చేసే ‘సూపర్ ఫుడ్స్’ పేరు పొందాయి.
సమతుల్యం కోసం..
ఆహారంలో సమతుల్యం కోసం మసాలా దినుసులను ఉపయోగిస్తారు. వేడి, చల్లని, తేమ, పొడి వంటివాటిని ఇవి సమతుల్యం చేస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ‘చేపను చల్లటి ఆహారం అనుకుంటే.. మసాలా దినుసులు ఆ ఆహారంలోకి కావాల్సిన వేడిని’ అందిస్తాయి. మనదేశం లో ఎన్నో ఏళ్లుగా వీటిని ఉపయోగిస్తున్నారు. మసాలా దినుసులు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఉప్పుకు అవి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఉప్పు, నూనె వంటి పదార్థాలకు బదులుగా మసాలా దినుసులను వాడటం వల్ల రుచిని, ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సీజన్లలో దొరికే కూరగాయాలు, పండ్లపై మసాలా దినుసు లు చల్లుకుని తింటే రుచిగా ఉంటుంది.
ఈటింగ్ ప్యాటర్న్..
అతిగా తిన్నా.. తక్కువ ఆహారం తీసుకు న్నా.. గట్ (పేగులు) ఆరోగ్యం దెబ్బతింటుం ది. గట్ హెల్త్‌ను రక్షించుకోవడానికి సరైన ఆహార విధానాన్ని అనుసరించాలి. ఫైబర్.. పేగులకు ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఇది ఒకటి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫైబర్ పేగు కదలికను, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోతే.. గట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయ లు, తృణధాన్యాలు, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
ఫ్లెక్సిటేరియన్ డైట్!
డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీని లో స్పష్టమైన నియమాలు, క్యాలరీలు, పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. ఈ డైట్‌లో ఏం తీసుకుం టారంటే..
* పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు తీసుకోవడం.
* నాన్‌బెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడం.
* మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం.
* ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటం.
* స్వీట్లను పరిమితంగా తీసుకోవడం. మిరపకాయతో..
మిరపకాయలను కూరల్లో బాగా ఉపయోగిస్తారు కొందరు. అయితే ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు నిపుణులు. మిరపలో ప్రధానంగా క్యాప్సుసైన్ అనే రసాయనం ఉం టుంది. మిరపకాయలను తిన్నప్పుడు, ఈ రసాయనం శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి.. మెదడుకు సంకేతాలను పంపుతుంది. కాప్సుసైన్ ఎక్కువ కేలరీలను ఖర్చు చేసేందుకు సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుందని పలు అధ్యయ నాలు చెబుతున్నాయి. మనిషి ఎక్కువకాలం జీవించడానికి కాప్సుసైన్ సహాయపడుతుంది.
వారానికి నాలుగు సార్లు మిరపకాయలతో కూడిన ఆహారాన్ని తినే వ్యక్తులు మరణించే ప్రమాదం తక్కువ అని 2019లో ఓ ఇటాలియన్ అధ్యయనం తేల్చింది. వారానికి ఒకసారి స్పైసీ ఫుడ్స్ తినేవారి కంటే ప్రతిరోజూ స్పైసీ ఫుడ్స్ తినేవారు మరణించే ప్రమాదం 14శాతం తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.
చిటికెడు పసుపుతో..
పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది నమ్ముతారు. పసుపులో కర్క్యుమిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. పసుపును సాధారణంగా శరీరంలో వచ్చే వాపును తగ్గించడానికి, ఇతర అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే రసాయనం లూపస్, రుమటాయిడ్, ఆర్థరైటిస్‌లతో సహా అటో వ్యాధులతో బాధపడుతు న్నవారు.. ఒక ముక్క అల్లం వేసి మరిగించిన నీటిలో చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే శరీరంలో వచ్చే వాపులను నియంత్రించవచ్చని 2023లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.