29-01-2025 12:32:06 AM
శతకం బాదిన తెలుగు తేజం lస్కాట్లాండ్‌పై ఘన విజయం
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండ ర్ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సూప ర్ సిక్స్‌లో భాగంగా మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా 150 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిష అజేయ సెంచరీతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
మహిళల అండర్ టీ20 ప్రపంచకప్‌లో శతకం బాదిన తొలి క్రికెటర్‌గా త్రిష రికార్డులకెక్కింది. తొలుత భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. త్రిష (59 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆయుషి 4 వికెట్లు, వైష్ణవి, త్రిష చెరో 3 వికెట్లు పడగొట్టారు. కాగా సెంచరీ సాధించిన త్రిషను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.