- ప్రిక్వార్టర్స్‌లో ఉక్రెయిన్ స్టార్
- రాడుకానుకు స్వియాటెక్ చెక్
- సిన్నర్ ముందంజ.. టేలర్ ఔట్
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపె న్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో సీడ్ జాస్మిన్ పవోలినికి షాక్ ఎదురైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన పవోలిని మూడో రౌండ్‌లో ఎలీనా స్వితోలినా చేతిలో ఓటమి పాలైంది. శనివారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్‌లో స్వితోలినా (ఉక్రెయి న్) 2 6 6 పవోలిని (ఇటలీ)పై విజయం సాధించింది. గంటన్నరకు పైగా సాగిన పోరులో స్వితోలినా ఏడు ఏస్‌లతో పాటు 34 విన్నర్లు సంధించగా.. మూడు డబు ల్ ఫాల్ట్స్, 30 అనవసర తప్పిదాలతో పవోలిని మూల్యం చెల్లించుకుంది.
మరో మ్యాచ్ లో ఇగా స్వియాటెక్ (పోలండ్) 6 6 మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)పై అలవోక విజయాన్ని అందుకుంది. కేవలం రెండు సెట్లలోనే ఎమ్మా ఆటను ముగించిన స్వియాటెక్ 24 విన్నర్లు కొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో జర్మనీకి చెందిన ఇవా లిస్‌తో తలపడనుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో యస్త్రేమ్సాపై రిబాకినా, డానియెల్ కొలిన్స్‌పై మాడిసన్ కీస్, జేబుర్‌పై ఎమ్మా నవ్వారో, పుతిన్సెవాపై కసత్‌కినా విజయాలు సాధించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు.
ప్రీక్వార్టర్స్‌లో మినార్
పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ మూడో రౌండ్‌కు పరిమితమయ్యాడు. మూడో రౌండ్‌లో మోన్‌ఫిల్స్ 3 7 7 (7/1), 6 ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. మూడు గంటల పాటు సాగిన సుదీర్ఘ పోరులో మోన్‌ఫిల్స్ 24 ఏస్‌లతో పాటు 58 విన్నర్లు సం ధించగా.. 44 విన్నర్లు కొట్టి న ఫ్రిట్జ్ ఆటలో ఒక డబుల్ ఫాల్ట్ చేయనప్పటికీ ఓటమి తప్పలేదు. ప్రపంచ నంబర్‌వన్ సిన్నర్ 6 6 6 గిరాన్‌పై సునాయాస విజ యం సాధించగా.. మిగిలిన మ్యాచ్‌ల్లో రూనే, మిచెల్‌సన్, అలెక్స్ డి మినార్, అన్‌సీడెడ్ టియెన్ విజయాలు సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.