calender_icon.png 25 October, 2024 | 7:51 AM

సూపర్ స్వితోలినా

07-07-2024 12:05:00 AM

ప్రిక్వార్టర్స్‌లో ఉక్రెయిన్ చిన్నది n నాలుగో రౌండ్‌కు సిన్నర్

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఉక్రెయిన్ చిన్నది ఎలీనా స్వితోలినా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. రెండో సీడ్ కోకో గాఫ్ సహా ఎమ్మా రాడుకాను, ఒస్టాపెంకాలు కూడా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్‌తో పాటు అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు జోరు కొనసాగిస్తూ ముందంజ వేశారు.

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ టోర్నీలో ఉక్రెయిన్ స్టార్ ఎలీనా స్వితోలినా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో స్వితోలినా 6 7 (7/4)తో పదో సీడ్ ఓన్స్ జబుర్‌ను వరుస సెట్లలో ఖంగుతినిపించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన స్వితోలినా ఒక ఏస్ మాత్రమే కొట్టినప్పటికీ 69 పాయింట్లు గెలుచుకుంది. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో స్వియాటెక్ 6 1 2 కజకిస్థాన్‌కు చెందిన యులియా పుతినెత్సెవా చేతిలో ఓటమి చవిచూసింది. మ్యాచ్‌లో స్వియాటెక్ 38 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన స్వియాటెక్ వింబుల్డన్‌లో మాత్రం మూడో రౌండ్‌కు పరిమితమైంది.

మిగిలిన మ్యాచ్‌ల్లో ఎమ్మా రాడుకాను 6 6 సక్కారిపై,  రెండో సీడ్ కోకో గాఫ్ 6 6 తో కర్తాల్‌పై, 13వ సీడ్ జెలెనా ఒస్టాపెంకా 6 6 పెరాపై  సునాయాస విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) 6 6 6 కెక్‌మనోవిక్‌పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మ్యాచ్‌లో సిన్నర్ 11 ఏస్‌లు కొట్టడంతో పాటు 35 విన్నర్లు సంధించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6 6 7 (17/15)తో విజయం సాధించి ముందంజ వేయగా.. 9వ సీడ్ అలెక్స్ డీ మునార్‌కు వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో భారత స్టార్ రోహన్ బోపన్నె మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ౩ధూ౬, ౬ధూh౭ (౭/౬)తో జెబెన్స్ జంట చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.