హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహ జ.. ఐటీఎఫ్ టోర్నీలో అదరగొట్టింది. అమెరికా వేదికగా జరుగుతున్న మహిళల క్లాసిక్ 75 టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో సహజ 6 7 (7/5)తో రెండోసీడ్ మాండిక్ ఎలిజబెత్‌పై విజయం సాధించింది. నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన హనా మాండికోవా కూతురైన మాండిక్ ఎలిజబెత్‌పై సహజ పూర్తి ఆధిపత్యం కనబర్చడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 300వ స్థానంలో ఉన్న సహజ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్ సునాయాసంగా గెలుచుకున్న భారత రెండో ర్యాంకర్.. రెండో సెట్‌ను టై బ్రేకర్‌లో సొంతం చేసుకుంది. ఏడు బ్రేక్ పాయింట్లు సాధించిన సహజ మూడు డబుల్ ఫాల్ట్స్‌తో ముందంజ వేసింది. అంతకుముందు తొలి రౌండ్‌లో సహజ 1 6 6 ఆనా ఫ్రేపై గెలిచింది.