రాంచీ, నవంబర్ 23: మనీలాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2024లో గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆమె తాజా ఎన్నికల్లో భర్తకు అండగా నిలిచి పార్టీ విజయం కోసం విశేష కృషి చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్‌తో కలిసి ఆమె దాదాపు 200 సభల్లో పాల్గొన్నారు. క్రమంలోనే వారి జంట ‘బంటీ ఔర్ బబ్లీగా’ ప్రజల్లో గుర్తింపు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీ విమర్శలు తిప్పి కొడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు.