calender_icon.png 7 November, 2024 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ ఫజల్

07-11-2024 12:34:11 AM

‘సూపర్ టాకిల్’ ఈ పదం 

కబడ్డీలో చాలా పాపులర్. మ్యాచ్ సమయంలో అవతలి కోర్టులో ముగ్గురు లేదా అంతకంటే తక్కువ మంది రెయిడింగ్‌కు వచ్చిన 

వ్యక్తిని ఔట్ చేస్తే ‘రెండు పాయింట్లు’ ఇవ్వడాన్ని ‘సూపర్ టాకిల్’ అని పిలుస్తారు.

హైదరాబాద్: సాంప్రదాయ కబడ్డీ కూతకు సాంకేతికత, కార్పొరేట్ హంగులు జోడించగా వచ్చిందే ప్రొ కబడ్డీ సీజన్. సూపర్ టాకిల్ సమయంలో సమీకరణాలే మారిపోతుంటాయి. అందుకోసమే ప్రతి జట్టు బలమైన డిఫెండర్లను తీసుకుంటుంది. ప్రతీ సీజ్ లాగే  ఈసారి విజయాల్లో సూపర్ టాకిల్స్‌దే కీలకపాత్ర. అటువంటి సూపర్ టాకిల్స్‌కు ఇరానియన్ డిఫెండర్ ఫజల్ అత్రఛలి పెట్టింది పేరు. ఇరాన్‌కు చెందిన డిఫెండర్ ఫజల్‌ను బెంగాల్ రూ.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడమే గాక కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది.

ఇప్పటి వరకు లీగ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఫజల్ ఐదు సూపర్ టాకిల్స్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో జరిగిన సీజన్ 2లో బెస్ట్ డిఫెండర్‌గా ఎన్నికయ్యాడు. అంతే కాకుండా రెండు సార్లు తాను ఆడిన జట్లు చాంపియన్‌గా నిలవడం విశేషం. పీకేఎల్ సీజన్ భాగంగా బుధవారం హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్‌లో యూ ముంబా 42 తేడాతో  పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ముంబై రెయిడర్ అజిత్ చవాన్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా.. పట్నా రెయిడర్ దేవాంక్ 15 రెయిడ్ పాయింట్లతో సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో  తెలుగు టైటాన్స్ 35 తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.