నమీబియాపై విజయం
అంటిగ్వా: టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా జట్లు సూపర్ అర్హత సాధించాయి. గ్రూప్ భాగంగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (43 బంతుల్లో 36, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. మైకెల్ వాన్ (10) రెండెంకల స్కోరు అందుకోగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జాంపా 4 వికెట్లతో చెలరేగాడు. స్టోయినిస్, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేధనలో ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 74 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. వార్నర్ (8 బంతుల్లో 20, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్ష్ (9 బంతుల్లో 18 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) దంచికొట్టారు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్ ఒక వికెట్ తీశాడు. ఆడమ్ జాంపా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.
లంకకు నిరాశే
ఫ్లొరిడా: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకకు నిరాశే ఎదురైంది. నేపాల్‌పై విజయంతో సూపర్ ఆశలు నిలుపుకోవాలనుకున్న ఆ జట్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం అంతరాయంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. గ్రూప్ భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 ఓటములు, ఒక మ్యాచ్ రద్దవ్వడంతో ఒకే పాయింట్‌కు పరిమితమైన లంక భారంగా ఇంటిబాట పట్టగా.. మూడు విజయాలు నమోదు చేసుకున్న దక్షిణాఫ్రికా అధికారికంగా సూపర్ అడుగుపెట్టింది.