calender_icon.png 8 October, 2024 | 4:57 AM

యాక్షన్ చేయనున్న సూపర్ ఏజెంట్లు

05-10-2024 12:00:00 AM

యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శివ్ రావెల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆలియాభట్ టైటిల్ పాత్రలో కనిపిస్తారు. మరో హీరోయిన్ శార్వరీ వాఘ్ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో వీళ్లద్దరూ సూపర్ ఏజెంట్స్‌గా నటిస్తున్నారు. పక్కా స్పై వర్స్‌లో రూపొందుతోంది. శివ్ రావెల్ దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందని, 2025 క్రిస్మస్‌కు ఇది పక్కా హాలిడే ట్రీట్ అని అంటున్నారు మేకర్స్. స్టన్నింగ్ విజువల్స్, అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్సులు, ఇంటెన్స్ యాక్షన్స్, అన్ ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులతో అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కించడానికి అన్ని విధాలా ఆదిత్య చోప్రా కృషి చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంటోంది.