సీపీకి ఫిర్యాదు చేసిన నరేంద్రచౌదరి
ఖమ్మం, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్ర మార్కకు నరేంద్ర ప్రధాన అనుచరుడు మిక్కిలినేని నరేంద్రచౌదరిని హత్య చేసేందు కు ఆంధ్రాకు చెందిన రౌడీషీటర్లు సుపారీ తీసుకున్నట్లు విస్తృతం ప్రచారం జరుగుతున్నది. ఇందుకు సంబంధించి సోషల్ మీడి యాలో ఒక ఆడియో వైరల్‌గా మారింది.
నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ విడుదల చేసిన ఈ ఆడియోలో జాగ్రత్తగా ఉండాలంటూ, సుఫారీ గురించి నరేంద్రచౌదరిని హెచ్చరించాడు. మహిళా కార్పొరేటర్ భర్త అయిన నరేంద్రచౌదరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. మున్నేరు వరదల సమయంలో ఖమ్మం పర్యటనకు వచ్చిన హరీశ్‌రావు, ఇంద్రారెడ్డి కార్లపై నరేంద్రచౌదరే రాళ్లు వేయించినట్లు ఆరోపణలు వచ్చా యి.
ఖమ్మం జూబ్లీక్లబ్ ఎన్నికలు వివాదాస్పదమైన సందర్భంలో కూడా ఆయన కీలకం గా వ్యవహరించారు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో ఆయన హత్యకు కుట్ర జరుగుతుందంటూ ప్రచారం జరగడం పట్ల మిక్కిలినేని నరేంద్ర సోమవారం సీపీ సునీల్‌దత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.