04-04-2025 12:52:24 AM
80 పరుగులతో కోల్‌కతా విజయం
కోల్‌కతా, ఏప్రిల్ 3: ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) హ్యాట్రిక్ ఓట మిని మూటగట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 80 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవ ర్లలో 6 వికెట్ల న ష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్ (60), రఘువంశీ (50), రింకూ సింగ్ (32 నాటౌట్) రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో షమీ, కమిన్స్, మెండిస్, హర్షల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది.
క్లాసెన్ (33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కమిందు మెండిస్ (27) పర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లతో ఎస్‌ఆర్‌హెచ్ పతనాన్ని శాసించారు. తొలి మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. కేకేఆర్ రెండో విజయాన్ని అందుకుంది.