calender_icon.png 15 April, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్ ను షేక్ చేయించిన అభిషేక్..

12-04-2025 11:22:43 PM

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఉత్కంఠంగా గెలిచింది. 246 టార్గెట్ తో వచ్చిన హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(141) సెంచరీతో విరుచుకుపడ్డాడు. ట్రావిస్ హెడ్(66),  హెన్రిచ్ క్లాసెన్(21), ఇషాన్ కిషన్(9) పరుగులు తీశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ సమర్పించుకున్నాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(82), ప్రభ్ సిమ్రన్ సింగ్(42), నేహల్ వధేరా(27), చివర్లో స్టాయినిస్(34) పరుగులతో రానించారు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, ఎషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టారు.