23-03-2025 07:39:20 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad ), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య రెండో మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్(34), నితీష్ రెడ్డి(30), అభిషేక్ శర్మ(24) పరుగులతో మెరిపించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో జురేల్ 70, శాంసన్ 66 పరుగులతో రాణించిన ఫలితం లేకుండపోయింది.