calender_icon.png 17 March, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'పది' విద్యార్థులకు సన్ రైజ్ పరీక్ష సామాగ్రి పంపిణీ..

17-03-2025 05:21:27 PM

వైరా (విజయక్రాంతి): వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల మండల పరిధిలోని పెద్ద గోపతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు సోదరి కట్టా జ్యోత్స్న పుట్టిన రోజు సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్క్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయటం అభినందనీయం అని, సంస్థ సభ్యులు తాము కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఇలా సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చించడం మంచి ఆలోచన అని అభినందించారు.

తల్లాడ ఎంపీడీవో ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పరీక్ష లకు మంచిగా సిద్దమౌవ్వాలని మంచి ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి అని తెలిపారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు మాట్లాడుతూ... విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తాము చదివిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు ఏనుగు శివ రాఘవ, ప్రతినిధులు యంపీ దాస్, షేక్ సుభాని, శోభన్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.