calender_icon.png 8 April, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామా.. ఘన నామ..

07-04-2025 12:00:00 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జాట్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దీన్ని అగ్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ కథానాయికలుగా నటిస్తుండగా, వినీత్‌కుమార్, రణ్‌దీప్ హుడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్ల ద్వారా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్న చిత్రబృందం శ్రీరామనవమి సందర్భంగా సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది. ‘ఓ రామ శ్రీరామ.. జయరామ రఘురామ ఘన నామా జగదబిరామా.. శ్యామా సోమా సాయిరే’ అంటూ సాగే ఈ పాటను అద్వితీయ వొజ్జల, శ్రుతి రంజని రాయగా, థమన్ సంగీత సారథ్యంలో ధనుంజయ్ సీపాన, సాకేత్ కొమ్మజోస్యుల, సుమనస్ కాసుల, సాత్విక్ జీ రావు, వాగ్దేవి కుమార ఆలపించారు. ఇందులో సన్నీ డియోల్ భుజానికి బ్యాగ్ వేసుకొని సాధువుల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తూ ఎంట్రీ ఇచ్చారు.