25 May, 2026 | 5:14 AM

సబ్సిడీలో జనుములొచ్చాయి

25-05-2026 12:00 AM

చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్లాల్ వెల్లడి

చేవెళ్ళ మే 24 (విజయక్రాంతి): పునాస పంటకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50% సబ్సిడీతో జనుములు అందించనుంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి శంకర్లాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. జనుము విత్తనాలు పంపిణీకి అందుబాటులో ఉన్నయని కనీసం 1 ఎకరం భూమి ఉన్న రైతులు సబ్సిడీ ద్వారా జన్మలు పొందవచ్చు అన్నారు.

పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు తీసుకుని రావలని చూచించారు. నేడు ఆయా గ్రామాల రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కోరారు. విత్తనాలకు సంబంధించిన తగు రసీదు తీసుకోవలసిందిగా తెలిపారు. ముందుగా వచ్చిన రైతులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.  క్వింటాలు జనుము విత్తనాల పూర్తి ధర రూ. 15,550/- కాగా 50శాతం సబ్సిడితో  రూ.7,775/-లు రైతు చెల్లించాలాన్నారు. 40కేజీలకు గాను రూ.6220/- కాగా 50శాంతం సబ్సిడితో రైతుకు 3,110/- అందిస్తున్నమన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని ఆయన కోరారు.