17-03-2025 06:52:30 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డిఎస్పీగా సుంకరి శ్రీనివాసరావు సోమవారం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో శ్రీనివాసరావు సుదర్శన ఎస్సైగా నిజాంబాద్ జిల్లా జక్రంపల్లి ఎస్సైగా బాన్సువాడ సిఐగా బోధన్ రూరల్ సీఐగా కామారెడ్డి పట్టణ సిఐగా పనిచేశారు. హైదరాబాద్ సిటీలో తీన్మార్ మల్లన్న అరెస్టు చేసిన శ్రీనివాస్ రావు శాంతి భద్రతల సమస్యలను పగడ్బందీగా నిర్వహిస్తారని పేరు సంపాదించుకున్నారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన పలు సంఘటనలను చక్కదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపి పట్టణ సీఐగా శభాష్ అనిపించుకున్నారు.
ఎంతో సౌమ్యుడుగా ఉంటూ సమస్యల పరిష్కారంలో ఇరువర్గాల సమస్యలను విని ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం వైపే ముగ్గు చూపుతో పోలీసు ఉన్నత అధికారులతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులకు న్యాయం చేస్తారన్న పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రీనివాసరావు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా బదిలీపై వచ్చి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను పోలీస్ అధికారులు సిబ్బందితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఎల్లారెడ్డి డిఎస్పీగా పని చేసిన శ్రీనివాసులు కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. బాధితుల సమస్యలను వెంట సామరస్యంగా సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులు బదిలీపై వెళ్లినప్పుడు కూడా స్థానికులు బదిలీని నిలిపి చేయాలని ఉన్నతాధికారులకు స్థానిక ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు.
ఎల్లారెడ్డి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుంకరి శ్రీనివాసరావు ఈ సందర్భంగా విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ... ప్రజల సమస్యలను శాంతి యుతంగా పరిష్కరిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో కాకుండా యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా సర్కిల్ పరిధిలోని కేంద్రాల్లో విద్యార్థులకు యువతకు కౌన్సిలింగ్ కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా వచ్చి సమస్యను వివరించవచ్చునని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నిర్వహిస్తామన్నారు. ఎల్లారెడ్డి సబ్ డివిజన్ ప్రజలు పోలీసులకు సహకరించి శాంతియుతంగా ఉండే విధంగా సహకరించాలని కోరారు.