05-04-2025 10:19:35 PM
బడుగుల సంక్షేమమే ఎమ్మెల్యే లక్ష్యం..
మండలంలో ఘనంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి జన్మదిన వేడుకలు...
కొల్చారం (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి నర్సాపూర్ శాసనసభ్యులు వాకిటి సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం నాడు మండల కేంద్రం కొల్చారంలో పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నర్సాపూర్ నియోజకవర్గ ఆశాజ్యోతి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు సేవలందించాలని పేర్కొన్నారు.
కార్యకర్త కష్టసుఖాల్లో పాలుపంచుకొని నేనున్నానంటూ దిమాయిస్తున్న సునీత లక్ష్మారెడ్డి సెగ్మెంట్ పరిధిలో గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల మండలాలు పొందిన మహా నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఏడుపాయల దుర్గాభవాని మాత వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షులు సంతోష్ రావు,మాజీ ఎంపీపీ మంజుల కాశినాథ్, డిసీఎమ్మెస్ వైస్ చైర్మన్ అరిగి రమేష్ కుమార్, నాయకులు ముత్యం గారి సంతోష్, మాజీ డీసీఎంస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ నరేందర్ రెడ్డి, యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, వేమారెడ్డి, రాజా గౌడ్, ముత్యం ప్రవీణ్, దుర్గ ప్రసాద్ గౌడ్, చిన్న రాములు, కొమ్ములు యాదగౌడ్, చిట్యాల యాదయ్య, సాయిని సిద్దిరాములు, గౌరీశంకర్, గోదావరి, నెల్లి కిష్టయ్య, సందీప్, మోత్కు మల్లేష్, యాదయ్య, ఆంజనేయులు, రవీందర్, వినోద్ నాయక్, రాజగౌడ్, కర్రే నారాయణ, మల్లగౌడ్, శేఖర్ గౌడ్, రాములు, ప్రభాకర్, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.