calender_icon.png 19 March, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరిక్షం నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్

19-03-2025 09:37:04 AM

ఫ్లోరిడా: అంతరిక్షం నుంచి సురక్షితంగా సునీతా విలియమ్స్(Sunita Williams), విల్మోర్ భూమిపైకి వచ్చారు. సునీత, విల్మోర్(Barry Wilmore)తో పాటు నిక్ మేక్, గోర్బునోవ్ భూమిపైకి చేరుకున్నారు. నలుగురు వ్యోమగాములను క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమిపైకి తీసుకువచ్చింది. తెల్లవారుజామున 3.27 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా దిగింది. ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో క్రూ డ్రాగన్ వ్యోమనౌక దిగింది. 17 గంటల ప్రయాణం తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమిపైకి వచ్చింది. సముద్ర జలాల్లో దిగిన వ్యోమనౌకను నాసా బయటకు తీసుకువచ్చింది.

భద్రతా పరీక్షల తర్వాత డ్రాగన్ వ్యోమనౌకను సహాయ బృందాలు తెరిచాయి. సునీతా విలియమ్స్  9 నెలల తర్వాత రోదసి నుంచి భూమిపైకి వచ్చింది. భూమిని చేరుకున్నాక సునీతా విలియమ్స్ బృందం నవ్వుతూ చేతులు ఊపి హాయ్ చెప్పారు. సునీత మూడోసారి రోదసి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 2006,2012లోనూ సునీత అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. సునీత, విల్మోర్  2024 జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్ కు వెళ్లిన వారం రోజుల్లో తిరిగిరావాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి అంతరిక్షంలోనే ఉండిపోయారు. 288 రోజుల అంతరిక్ష కేంద్రంలోనే వీరు ఉండిపోయి ఇప్పుడు తిరిగి భూమిపైకి వచ్చారు.