23-03-2025 12:43:11 AM
వాషింగ్టన్, మార్చి 22: అంతరిక్షం నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగొచ్చిన నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియ మ్స్, బుచ్ విల్మోర్ ఓవర్ టైం శాలరీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆస్ట్రోనాట్ల ఓవర్ టైం శాలరీ గురించి మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను అడగ్గా.. ఈ అంశాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని, తన సొంత డబ్బు నుంచి ఆస్ట్రో నాట్లకు అదనపు జీతం చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు.
సునీతా విలియమ్స్, విల్మోర్ నాసాలో జీఎస్ కేటగిరీ ఫెడరల్ ఎంప్లాయిస్. ఈ ఇద్దరి జీతం సంవత్సరానికి సుమారు కోటీ 8 వేల నుంచి కోటీ 41 లక్షలు ఉంటుంది. ఈ లెక్కన వారికి తొమ్మిది నెలలకు గానూ 81 లక్షల నుంచి కోటీ 5 లక్షల దాకా చెల్లించాలి. కానీ నాసా షెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ వ్యవధి ఎనిమిది రోజులే.
కానీ స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఓవర్ టైం ఉన్నందుకు నాసా అదనంగా ఏం చెల్లించకపోగా రోజుకు 4 డాలర్లు మాత్రమే ఇద్దరికి చెల్లించనున్నారు. భారత కరెన్సీలో రోజు కు కేవలం 347 రూపాయలు మాత్రమే. 287 రోజుల కాలానికి వారికి దక్కేది 1148 డాలర్లు..
మన కరెన్సీలో 99, 816 రూపాయలు. ఎంతో రిస్క్ చేసినా అదనపు జీతం లేకపోవడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన సొంత డబ్బును సునీతా విలియమ్స్, విల్మోర్‌లకు అదనపు జీతంగా చెల్లి స్తానని మీడియా ముందు ప్రకటించారు.
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్‌కు మస్తు గిరాకీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రక టించిన గోల్డ్ కార్డులకు మస్తు గిరాకీ లభిస్తోంది. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీూ స్థానంలో గోల్డ్ కార్డు తీసుకు రానున్నట్లు ట్రంప్ ఇదివరకే స్పష్టం చేశా రు. 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 44 కోట్లు) చెల్లిస్తే నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు.
కేవలం ఒక్క రోజులోనే వెయ్యి గోల్డ్ కార్డు లు విక్రయిం చినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 5 బిలియన్ డాలర్లు సేకరించిన ట్లు తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా 37 మిలి యన్ల మందికి గోల్డ్ కార్డును కొనుగోలు చేయగల సామర్థ్యం ఉంది. ఒక మిలియన్ మంది వీటిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.
వీటి ద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశముంది’ అని లుట్నిక్ పేర్కొన్నారు. పౌరసత్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షో భాన్ని కొంత వరకు తగ్గించువచ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో ఈబీ ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫర్లను ప్రకటించారు. ఈబీ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీ యులకు గ్రీన్‌కార్డు ఇస్తారు.